![]() |
![]() |

ఇప్పుడు బుల్లితెర మీద ఎక్కడ చూసినా అనసూయ హవానే నడుస్తోంది. అనసూయ గురుంచి ఎంత చెప్పుకున్నా తక్కువే. యాంకర్ గా, యాక్టర్ గా ఫుల్ బిజీబిజీగా గడుపుతోంది అనసూయ. ప్రస్తుతం స్టార్ మాలో ప్రసారమవుతున్న షోస్ తో మస్త్ ఎంటర్టైన్ చేస్తోంది ఆడియెన్సుని. అందం తో అందరినీ కట్టిపడేస్తుంది. ఇక ఇప్పుడు పార్టీ చేద్దాం పుష్ప షోలో మంచి హాట్ హాట్ గా డాన్స్ చేసి రచ్చ రచ్చ చేసింది అనసూయ. రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాస్ట్యూమ్ లో రారా రక్కమ్మ సాంగ్ కి అద్దిరిపోయేలా డాన్స్ చేసేసరికి స్టేజి మొత్తం దద్దరిల్లిపోయింది.. ఈమెకు యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన అందచందాలతో ఎప్పుడూ సోషల్ మీడియాలో సందడి చేస్తూ లైక్స్ ని కామెంట్స్ ని సొంతం చేసుకుంటూ ఉంటుంది. స్కిన్ టైట్ కాస్ట్యూమ్స్ లో అందాల్ని చూపిస్తూ అనసూయ చేసే వీడియోస్ సోషల్ మీడియాలో ఫుల్ ట్రేండింగ్ లో ఉంటాయి.
ఇక ఈమె చేసే డాన్స్ కి ఎవ్వరైనా సరే ఫిదా అవ్వకుండా ఉండదు. అన్ని రకాల ట్రెండీ డ్రెస్సెస్ లో కనిపిస్తూ మంచి జోక్స్ పేలుస్తూ తన గ్లామర్ కి కాస్త గ్రామర్ ని జత చేసి బుల్లితెర మీద రాకెట్ లా దూసుకుపోతోంది. ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారం కాబోయే పార్టీ చేద్దాం పుష్ప షోలో అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ తో మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్ చేసింది. చేతినిండా షోస్ తో, మూవీ రోల్స్ తో ఎక్కడ తగ్గట్లేదు అనసూయ. కొంచెం టైం దొరికిన భర్తతో కలిసి వెకేషన్స్ కి వెళ్లి అక్కడి ఫొటోస్, వీడియోస్ కూడా షేర్ చేసి ఆడియన్స్ తో మంచి రాపో మెయింటైన్ చేస్తోంది అనసూయ. ఇక నెటిజన్స్ కూడా డాన్స్ అదిరిపోయింది అని కామెంట్స్ చేస్తున్నారు.
![]() |
![]() |